సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మధ్యప్రదేశ్ లో నేడు, శనివారం తెల్లవారు జాము ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బస్సులను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు..అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..రేవా-సత్నా సరిహద్దుల్లోని బర్ఖదా గ్రామం సమీపంలో సిమెంటు లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు టైరు పేలిపోయింది. దీంతో వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మూడు బస్సులను వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు ఒకవైపు పడిపోగా.. మరో బస్సు పక్కనే ఉన్న లోయలో బోల్తాకొట్టింది. బస్సుల్లో ఉన్న ప్రయాణికులు సత్నా లో జరిగిన ‘కోల్ మహాకుంభ్’ ఉత్స వాల్లో పాల్గొని తిరిగి వస్తూ బస్సు అక్కడ అపి ప్రసాదాలు తింటుండగా ఈ ఘోరం జరిగింది.
