సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల లోకేష్ తన పాదయాత్రలో టీడీపీ కార్యకర్తల నుద్దేశించి సభలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాని జగన్ ప్రభుత్వాన్ని దించడానికి ఎవరు కల్సి వచ్చిన ఆహ్వానిస్తామని పేర్కొనడంపై .. ఒక మీడియా ఛానెల్ లో మాజీ మం త్రి కొడాలి నాని మండిపడ్డారు. అసలు లోకేష్ ఏమిటి ? వార్డు మెంబర్ గా గెలవలేనివాడు ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? అని ధ్వజమెత్తారు. అసలు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నాడు కదా? మరి పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ చెంత చేరి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కు పార్టీ స్వంతమవుతుందా? ఎప్పుడు ఎన్నికలు వచ్చిన జనం చంద్రబాబు ముఖం చూసి ఓట్లు వెయ్యరు. ఒంటరిగా పోటీ చేసే దొమ్ము లేక.. ఎదో పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబు ది . జూ, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణని చంద్రబాబు, పార్టీ సమావేశాలకు పిలవకుండా ఘోరం గా అవమానించలేదా? 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు హరికృష్ణ ను గ్యాలరీలో కూర్చో బెట్టి అవమానించారు. జూనియర్ ముందు చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీని అప్పగించాలని డిమాండ్ చేసారు. మార్పు రాష్ట్రం లో కాదు టీడీపీలో రావాలని ఎద్దేవా చేసారు కోడలి నాని..
