సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలంగాణాలో ఇటీవల జరుగుతున్నా వరుస సంఘటనలు .. రోజుకో దారుణం.. వార్తలు వింటుంటే యువత లో బేజారుతానం.. మనిషిలో మానవత్వం ఉందా ? అని ఆందోళన కలుగుతుంది. ప్రియురాలి ప్రేమకోసం సాటి స్నేహితుడి ను అత్యంత దారుణంగా చంపిన మానవ మృగం..దానికి ప్రియురాలి ప్రశంస.. మరో ప్రక్క పెద్దలు ఒప్పుకోలేదని ఇద్దరు ప్రేమికులు ఉరేసుకొని ఆత్మహత్యలు.. మరో ప్రక్క తన సీనియర్ సైఫ్ దారుణంగా వేధిస్తున్న ఎవరు పట్టించుకోవడంలేదని బాధతో.. అత్యంత సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన..మొత్తానికి గిరిజన కుటుంబంలో పుట్టి ఉన్నత భవిషత్తు కోసం చదువుతున్నధారావత్‌ ప్రీతి కథ విషాదాంతమైంది. ఐదు రోజలుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో మృత్యువుతో ఐదు రోజులుగా చేస్తున్న పోరాటంలో ఓడిపోయింది. ఆమె మరణవార్తతో కేఎంసీలోని వైద్య విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. దీనితో కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్‌ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుండి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ర్యాగింగ్‌కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. నేడు, సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్యారంటీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి – నియంత పాలనలో సామాన్యులు బతకలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *