సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లాలో గత ఆదివారం రాత్రి తీవ్ర విషాదం నెలకొంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంతూరైన పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ శాంతినగర్ చెరువులో ఆరుగురు యువకులు గల్లంతైన నేపథ్యంలో మంత్రి కాకాణి చెరువు దగ్గరుండి గాలింపు చేపట్టారు. వారిలో నలుగురు యువకుల మృతదేహాలు నేటి సోమవారం ఉదయం లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం ముమ్మరంగా చెరువులో గాలిస్తున్నారు. గత సాయంత్రం తోడేరులోని 100 ఎకరాల విస్తిరంలో ఉన్న చేపల చెరువులో పడవలో షికారుకెళ్లిన 10 మంది యువకుల్లో పడవలో నీరు చేరటంతో ఆరుగురు గల్లంతయ్యారు. మరో నలుగురు క్షేమంగా ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ లోతు గరిష్ఠంగా 20 అడుగుల వరకూ ఉంటుందని అంచనా. పడవ నుంచి దూకేసిన ఆ 10 మందిలో సురేంద్ర(19), బాలాజీ(21), కల్యాణ్(28), శ్రీనాథ్(18), రఘు(24), ప్రశాంత్(29) గల్లంతయ్యారు. విష్ణు, కిరణ్, మహేంద్ర, మహేశ్ ఒడ్డుకు చేరుకున్నారు
