సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సిటిజన్‌ చార్టర్‌లో పేర్కొన్న విధంగా మీసేవ కేంద్రాల్లో అన్ని డిజిటల్‌ సేవలు అందించేందుకు వీలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు పూర్తిగా అమలు కాలేదని వస్తున్నా ఆరోపణలపై పూర్తి సమాచారం తో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ మార్చి నెల 15వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ రఘునందనరావు ఈ మేరకు తాజగా ఆదేశాలిచ్చారు. మీసేవ కేంద్రాలు అందిస్తున్న డిజిటల్‌ సేవల విషయంలో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని, నిలిపివేసిన సర్వీసులను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మీసేవ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.యుగంధర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు గతంలో మాదిరిగానే డిజిటల్‌ సేవలన్నింటినీ అందించేందుకు మీ సేవ కేంద్రాలకు వీలుకల్పించాలని 2022 మేలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు కాలేదని ఆరోపిస్తూ పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *