సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ,డి యన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు కళాశాల ఏంటి డ్రగ్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ.. సమాజంలో ప్రబలంగా ఉన్న మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండాలని, ఈ లక్ష్య సాధనకి ప్రభుత్వాలూ, సంస్థలూ, కుటుంబాలూ, వ్యక్తులూ అందరూ కలిసి పని చేయాలి. ఏ డ్రగ్ నైనా వాడకూడని విధంగా వాడితే అది డ్రగ్ ఎబ్యూజ్ కిందకే వస్తుంది. మీరు జీవితంలో చాలా ఎత్తుకు ఎదగవలసినవారు. ఎంతో సాదించవలసినవారు, మీరు డ్రగ్స్ వైపు వేసే ఒకే ఒక తప్పటడుగు మీ చేతులోంచి మీ జీవితంపై మీకున్న మొత్తం కంట్రోల్ను లాగేసుకుంటుంది. కావున డ్రగ్స్ మరియు దాని పరిసరాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ, ATVరవి కుమార్ మాట్లాడుతూ.. మీకు ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్ ని ప్రిస్క్రైబ్ చేసిన డోస్ కంటే బాగా ఎక్కువగా తీసుకుంటే అది డ్రగ్ ఎబ్యూజ్. ఏదో సరదాగానో, స్నేహితులతో కలిసో డ్రగ్స్ కు అలవాటవుతున్నారు. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు డబ్బు కోసం అనేక నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు తెలిపారు. గంజాయి కొకైన్, పారవశ్యం, హెరాయిన్ , డి-లైజర్జిక్ యాసిడ్ ,డైథైలామైడ్, మెథాంఫేటమిన్ వంటివి విద్యార్థులు విడనాడాలని ,ముత్తువదలి వారి గమ్యం వైపు పయనించాలి అని తెలిపారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు విద్యార్థులతో ఏంటి డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు.జిల్లా DMHO శ్రీ ఉమా మహేశ్వరరావు పాలకవర్గ సభ్యులు కొత్తపల్లి శివరామరాజు, ప్రిన్సిపాల్ డా ఎం అంజన్ కుమార్, ఇన్స్పెక్టర్ VVV వర్మ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా బి వి ఎస్ వర్మ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు
