సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టిస్తున్న సంచలనమ్ అందరికి తెలిసిందే.. 100 రోజులుగా 80 కోట్ల వసూళ్లతో ..జపాన్ దేశంలో ప్రదర్శితమౌతున్న తోలి భారతీయ చిత్రం ఇదే.. ఇక మరో 5రోజులలో ఆస్కార్ అవార్ట్ సాధించడం ఖాయం అని అందరు భావిస్తున్న నేపథ్యంలో .. హైదరాబాద్ రవీంద్రభారతిలోని ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన ‘వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం’ చర్చా కార్యక్రమం లోప్రముఖ దర్శక నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ ని విదేశీ చిత్రాల మధ్య పోటీగా నిలబెట్టటానికి ఆ సినిమా బృందం రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేసిందని అన్నారు. వాళ్ళ విమాన టికెట్స్ ఖర్చు మాములుగా లేదని దాని ప్రమోషన్ కు పెట్టిన డబ్బు తో మరో 8 చిత్రాలు నిర్మించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో, సినిమా వ్యాపారంలో సామాజిక స్పృహా లోపించిందని చెప్పారు.
