సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పటికీ రాజకీయాలలో సబ్దుగా ఉన్న ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ పార్టీలో ఆయన కు కీలక బాధ్య తలు అప్ప జెప్తామన్న కేంద్ర బీజేపీ పెద్దల హామీ మేరకు ఆయన చేరికకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున 4 సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ‘జై సమైక్యాంధ్ర ‘పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వా త పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్ లో చేరిపోయి మౌనంగా ఉంటున్నారు. మరో 3 రోజులలో ఆయన బీజేపీలో చేరికపై అధికారిక సమాచారం వస్తుందని భావిస్తున్నారు.
