సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లోనేడు, గురువారం ఇంటర్ పరీక్షలు వ్రాసి వస్తున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఉండ్రాజవరం మండలం, వేలివెన్ను, శశి విద్యాసంస్థలు కు చెందిన కాలేజీ బస్సు ను లారీ వేగంగా ఢీకోనడంతో బస్సు అద్దాలు పగలటం తో పాటు డ్రైవర్ కు విద్యార్థులకు గాయాలు అయినట్లు భావిస్తున్నారు. ప్రముఖ విద్య సంస్థ వేలివెన్ను శశి విద్యాసంస్థల ఇంటర్ విద్యార్థులు తణుకు లో పరీక్షలు వ్రాసి తిరిగి వస్తుండగా మునిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని డీ కొనడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థులను విద్యాసంస్థల యాజమాన్యం చికిత్స కోసం తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు.శశి విద్యాసంస్థ అధికారికంగా స్వాందిస్తే.. పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *