సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మం త్రి కార్యా లయం లో సమావేశమైన సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు సీఎం విజ్ఞాపన పత్రం అందించారు. దానిలో.. రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనేఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. ఈ నిధులను వెం టనే విడుదలచేయాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2, 600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ బకాయిలను వెం టనే కేంద్రం చెల్లించాలి. అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలిపి ప్రాజెక్టు ముంపు బాధితులకు త్వరగా పరిహారం ఇవ్వా లని విజ్ఞప్తిచేస్తున్నాను అని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *