సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో…. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తీపికబురు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ. ఎం. యస్. నెం. 34 ఎం. ఏ. తేది. 16-03-2023 ఉత్తర్వుల మేరకు రాష్ట్రం లో అన్ని నగరపాలక మరియు పురపాలక సంఘాలలో ఆస్తి మరియు ఖాళీ జాగా పన్నుల విషయం లో ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలు మరియు ఈ ఆర్థిక సంవత్సరం పన్ను పై విధించిన వడ్డీ ని వన్ టైమ్ మెజర్ గా మాఫీ చేయడం జరిగినది. అయితే, పన్ను చెల్లించవలసిన పన్ను చెల్లింపుదారులు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంతో సహా ఒకేసారి తేది. 31-03-2023 లోపు చెల్లించినట్లైతేనే ఈ వడ్డీ మినహాయింపు వర్తిస్తుంది. కావున, ఆస్తి పన్ను చెల్లింపుదారులు, ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వడ్డీ మినహాయింపు లబ్దిని పొంది మీ యొక్క ఆస్తి మరియు ఖాళీ జాగా పన్ను బకాయిలని వడ్డీ లేకుండా ఒకే సారి తేది. 31-03-2023 లోపు చెల్లించవలసినది గా విజ్ఞప్తి.పన్నులు మున్సిపల్ ఆఫీసు కౌంటర్, anni secretariat lalo. అంతే కాకుండా పన్నులను ఆన్-లైన్ ద్వారా (https://cdma.ap.gov.in/) నెట్-బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ / క్రెడిట్ కార్డు ల ద్వారా కానీ, UPI ద్వారా కానీ చెల్లించవచ్చు.
