సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: గత వారం రోజులుగా భీమవరంలో నిమ్మ కాయల ధర వింటే షాక్ కొట్టింది. నిమ్మకాయల బండి దగ్గర 20 రూపాయలకు 3 నిమ్మకాయలు అంటే పొరపాటున చెప్పాడేమో? అని మరల అడిగితె అదే మాట వినపడింది. నిన్నటి వరకు గోదావరి జిల్లాలలో కిలో నిమ్మకాయల ధర దాదాపు 100రూ కు చేరిపోయింది, (గతంలో 35 రూ-40రూ) అయితే తాజగా ఒక్కసారిగా నిమ్మకాయల ధర దిగివచ్చింది. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు పడటంతో మనకు దిగుమతులు పెరిగాయి, దీనితో పాటు ఒడిశాలో లారీల సమ్మె నేడు శుక్రవారం ముగిసిపోతుంది అని భావిస్తుండటంతో ఒక్కసారిగా ధరలు పడిపోతున్నాయి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే నిమ్మకాయలు ఎక్కువ ధరకు కొని నిల్వ ఉంచిన హోల్ సెల్ వ్యాపారులలో నష్టాల భయం పట్టుకొంది. జిల్లాలో నిమ్మసాగు చేస్తున్న రైతులకు కూడా కొంత నిరాశ ఎదురయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *