సిగ్మాతెలుగు డాట్ ఇన్,న్యూస్: పంజాబ్ లో తాజాగా హైటెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేడు, శనివారం పం జాబ్ పోలీసులు ఖలిస్తాన్ వేర్పాటువాదనేత అమృత్పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్లోని పలు జిల్లాల్లోపోలీసులు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ను పోలీసులు జలంధర్లో నేడు భారీ తెలుగు సినిమాలలో ఛేజింగ్ సన్నివేశాలు తలపించేలా దాదాపు 50 పోలీసులు కార్లలో అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు. పంజాబ్ లో ఇంటర్నెట్ లో ఎస్ఎం ఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని భావిస్తున్నారు,
