సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల యువ నటుల్లో విశ్వక్ సేన్ చాలా ప్రత్యేకంగా కనపడుతున్నాడు, ఇటు నటుడిగానే కాకుండా, అటు దర్శకుడిగా కూడా తన ప్రతిభకి సాన పెడుతున్నాడు. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమాతో ఉగాది రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ ధమ్కీ కి తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, విశ్వక్ సేన్.కి జోడిగా నివేద పెతురాజ్ ఇందులో కథానాయికగా చేసింది, రావు రమేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనపడతాడు. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే .. ఫస్ట్ అఫ్ చక్కగా తీసారు, సెకండ్ హాఫ్ మాత్రం గందరగోళంగా ఉంది, విశ్వక్ సేన్ మంచి నటుడు, బాగా కష్టపడతాడు. కానీ దీనికి ముఖ్య కారణం ఏమిటంటే.. . ఈ సినిమా కథ ఇటీవల రవితేజ హిట్ సినిమా ‘ధమాకా’ సినిమాకి కథ ఇచ్చిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ ‘దాస్ క ధమ్కీ’ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ‘ధమాకా’ కథ ఈ ‘దాస్ క ధమ్కీ’ కథ ఒకేలా వుంది. అయితే ‘ధమాకా’ ముందు విడుదల అయింది, అందుకని ఈ ‘దాస్ క ధమ్కీ’ కథని కొంచెం అటు ఇటు మార్చడానికి సెంకండ్ హాఫ్ మార్చారు అనిపిస్తుంది, అక్కడ ‘ధమ్కీ’ తేడా కొట్టింది. ఒక ప్రక్క హీరోగా డ్యూయల్ రోల్, మరో ప్రక్క దర్శకుడు గా ప్రతిభ , నిర్మాతగా భారీగా బడ్జెట్ తో ధమ్కీ నిర్మించిన విశ్వక్ సేన్ ను అభినందించవలసిందే,
