సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏప్రిల్ 5న విచారణ జరపనుంది. ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ తప్పుడు కేసులు పెడుతోందని పేర్కొంటూ కేంద్రంలోని అధికార బీజేపీ సర్కార్ అక్రమ కేసులతో తమను వేధిస్తోందని దేశంలోని 14 విపక్ష , ప్రాంతీయ పార్టీలు అన్ని ఒక్క త్రాటిపైకి వచ్చి సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించాయి. ఈడీకి అపరిమిత అధికారాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అరెస్టుకు ముందు, తర్వాత మార్గదర్శకాలు ఇవ్వాలని విపక్షాలు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాయి నేడు, .శుక్రవారం సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విపక్షాలు ఈ పిటిషన్‌ను మెన్షన్ చేశాయి. దీనిపై ఏప్రిల్ 5న విచారణ జరగనుంది. నిజానికి గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారమదంతో ఈ తరహా సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం గమనార్హం.. అంతే చేసిన పాపం వెంటాడుతుందంటే ఇదే..
