సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో 6 స్థానాలు గెలచినప్పటికీ ,టీడీపీ కూడా ఒక్క స్థానం గెలవడానికి సహకరించిన నలుగురు వైసిపి ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నేటి, శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ ఎమ్మెల్యేలు, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు 4గురు వైసిపి ఎమ్మెల్యేలను కొన్నారు.అని తేలిందని మాకున్న సమాచారం మేరకు..ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్ చేశారు. అంతేకాదు క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ కూడా ఇస్తామని ఆయన మభ్య పెట్టడంతో వాళ్ళు లొంగిపోయారని నిర్ధారిస్తూ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు, గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు ఈసారి దొరకలేదు అంతే తేడా అని ఎద్దేవా చేసారు,
