సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ఇటీవల అన్ని పట్టణాలలోనే కాదు పల్లెలలో కూడా ఇంటర్ నెట్ దూసుకొనిపోతున్న రోజులు..టివి ప్రేక్షకుల వినోద.చదువులు , సమాచార. షాపింగ్ అవసరాలును కేబుల్ టివిలో సాటిలైట్ , లోకల్ ఛానెల్స్ తీర్చలేవు, ఇక లోకల్ ఛానెల్స్ ప్రభావం బాగా తగ్గిపోయింది, మంచి కంటెంట్ తో నిర్వహణ కష్టంగా మారింది. యూ ట్యూబ్ ఛానెల్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. అందుకే ఎక్కడ చుసిన కేబుల్ టివి కనెక్షన్లు స్థానంలో నెట్, ఓటిటి , ఛానెల్ యాప్ ల ప్రసారాలు పెరిగిపోయాయి, మరో ప్రక్క ;జియో సినిమా’ యాప్ లో IPL మ్యాచు లు ఉచితంగా ప్రసారాలు 4 K క్వాలితో అందించడం కేబుల్ ఆపరేటర్ కు భారీ విఘాతంగా తగిలింది, ఈ పోటీలో ‘ఎం ఎస్ ఓలు, కేబుల్ ఆపరేటర్ ‘లు పూర్తీ స్థాయి నెట్ ఆపరేటర్ గా మారిపోతున్నారు, అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడుతున్న అతి స్వల్ప ధరలకే నడపబడుతున్న ఏపీ ఫైబర్ నెట్ సెట్ అప్ బాక్స్ లు ఉన్న ప్రేక్షకులకు ఎప్పడికప్పుడు అద్భుత క్వాలిటితో ఆధునిక వినోద సౌకర్యాలుతో ఛానెల్స్ ప్రసారాలుతో పాటు వివిధ యాప్ లను ఓటిటి సినిమా ప్లాట్ పారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, శుక్రవారం ప్రసాద్ ల్యాబ్లో .. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇకపై తెలుగు సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఛాన్స్ కల్పిస్తోంది ఏపీ ఫైబర్ నెట్. అని ప్రకటించారు, సీఎం,జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ప్రజల వద్దకు సినిమా తీసుకు వస్తున్నాం అన్నారు. మారుమూలగ్రామాల్లోఉన్న వారు కూడా రిలీజ్ రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు.’భారతదేశంలో ఎక్కడా లేని విధంగా inter net., కేబుల్ టివి, APPసేవలను, ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నాం. చిన్న నిర్మాతలకు ఉపయోగపడేలా సినిమాను బేస్ చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ఉంటుంది. ఎల్పీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాము కాబట్టి పైరసీ ఉండదు. ఏపీఎస్ఎఫ్ఎల్ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్ అయింది. దీనివల్ల మారుమూల గ్రామాల్లోఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం లభిస్తుంది’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *