సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఎట్టకేలకు తెలంగాణ ఖమ్మం జిల్లా లో కీలక బి ఆర్ ఎస్ పార్టీ ఫై గత కొంతకాలంగా పార్టీ ఫై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి లను ఎట్టకేలకు సీఎం కెసిఆర్ పార్టీ నుండి బహిష్కరించడం తో వారు కూడా కృతజ్ఞతలు చెప్పడం తాజా సంచలనం. పొంగులేటి అయితే..ఖమ్మం జిల్లా ప్రజలతోపాటు తనకు గతంలో రాజ్యసభ ఇస్తానని కెసిఆర్ మాట తప్పి మోసం చేసారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జిల్లా నుండి ఒక్క బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని సంచలన సవాల్ విసిరారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ..ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, ఆంధ్రా సీఎం జగన్ మాట జవదాటని అత్యంత సన్నిహితునిగా ఇప్పటికి కొనసాగుతున్న నేత గా పేరుంది.. ఖమ్మం జిల్లాను రాజకీయంగా కంట్రోల్ చేసే శక్తి ఆయనకు ఉంది. ఎంతటి శక్తిమంతుడంటే.. రాష్ట్ర విభజన తరువాత కూడా పచ్చి సమైక్యత వాదిగా తెలంగాణలో వైసీపీ తరఫున తాను ఖమ్మం ఎంపీగా లక్షకు పైగా మెజారిటీతో గెలవడంతో పాటు మరో ముగ్గురు వైసిపి శాసనసభ్యులను గెలిపించి, మరో ఇద్దరినీ ద్వితీయ స్థానాలలో నిలిపిన సత్తా ఉన్న నేత పొంగులేటి. సీఎం జగన్ తెలంగాణ లో వైసిపి ని ఎన్నికలకు పోటీకి దూరంగా ఉంచడంతో ఆయన తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆయనకు ఎంపీ కాదు కదా. ఎటువంటి పదవి లేదు. ఇప్పుడు ఆయన జాతీయ స్థాయి నేతల పిలుపుల మేరకు బీజేపీ లో లేక కాంగ్రెస్ లో చేరతారా? లేక ఇప్పటికే వై ఎస్ విజయమ్మ, షర్మిల లతో సమాలోచనలు చేసిన దృష్ట్యా తెలంగాణ వైసిపి లో చేరతారా ? అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న..
