సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం ఆర్యవైశ్యవర్తక సంఘ భవనము (త్యాగరాజ భవనము) నందు మన తెలుగు ఆధ్యాత్మిక సంస్కృతీ, కళలు పరిరక్షణలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీవరకు .నిర్వహింపబడుతున్న హరికధా సప్తాహ మహోత్సవము పురస్కరించుకొని ముగింపు వేడుకలలో భాగంగా ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 9 గం.ల నుండి వేదపారాయణ, లయవిన్యాసము, ప్రముఖ హరికధాకళాకారులకు సత్కారము, నామసంకీర్తన, మహామంగళహారతి అనంతరం శ్రీ సత్యసాయి సేవా సమితి, శ్రీరామపురం, భీమవరం వారిచే మహా ప్రసాద వితరణ ఏర్పాటు చేయబడినది. కావున భక్తజనులందరూ కార్యక్రమంలో పాల్గొని భోజన ప్రసాదము స్వీకరించి భగవదనుగ్రహ ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు రాయప్రోలు చలపతిరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *