సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రబి సీజన్ లో పొలాల లో బంగారం రాసులు పోసినట్లు పంట దిగుబడి బాగా వస్తున్నా నేపథ్యంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా, రబీ ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టరు ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె మాట్లాడుతూ.. . మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నాణ్యత ప్రమాణాలకు లోబడి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. 2022–23 కాలానికి ధాన్యం 100 కిలోలు కామన్‌ రకం రూ.2,040, ఏ గ్రేడ్‌ రకం రూ.2,060, 75 కిలోలు కామన్‌ రకం రూ.1530, ఏ గ్రేడ్‌ రకం రూ.1545 చొప్పున కొనుగోలు చేస్తామని కలెక్టరు తెలిపారు. తేమ 17 శాతం ఉండే ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. సంచులు, హమాలీలను, రవాణాకు కావలిసిన వాహనదారులను ఎవరు సమకూరిస్తే వారికి ప్రభుత్వం వారు నిర్ధేశించిన సొమ్మును చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *