సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి మందిరంలో ఈనెల 14 నుంచి 21 తేదీ వరకు స్వామివారి 12వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మందిర అధ్యక్ష, కార్యదర్శులు కంతేటి వెంకటరాజు, కుక్కల బాల తెలిపారు. నేడు గురువారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన బ్రోచర్ ఆవిష్కరించారు. రేపు శుక్రవారం 14న స్వామివారిని, అమ్మవారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె చేయుట, 15న ఉదయం ద్వజరోహణ, ఉంజల్ సేవ, ఉయ్యాల కైంకర్యం, సాయంత్రం కళ్యాణ మహోత్సవం, 16న గరుడోత్సవం, 17న అష్టముఖ గండ భేరుండ లక్ష్మి నరసింహ హోమం, సదాస్యం- వేద సభ, వైభవోత్సవం, 18న ధన్వంతరీ హోమం, సాయంత్రం స్వామివారి రథోత్సవం, 19న ఉంజల సేవ, 20న ద్వాదశరాధన, 21న అన్న కూటోత్సవం, అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో జానపాటి మధు, కడలి వెంకటేశ్వరరావు, పాణింగిపల్లి శ్రీనివాసాచార్యులు, సయ్యపురాజు సూర్యనారాయణ రాజు, ఫణి, కెవిఎస్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
