సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 13 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. వీటిలో అత్యధికంగా ఏలూరు జిల్లాలో 11 కేసులుండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం 2 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఏలూరు జిల్లాలో చింతలపూడి, వెంకటాపురం, ఉర్లగూడెం, ఊటసముద్రంలో ఒక్కొక్కటి, ఏలూరు నగర పరిధిలో పత్తేబాద, తాపీమేస్త్రీకాలనీలో ఒక్కొక్కటి, నూజివీడు రూరల్ పరిధి గొల్లపల్లిలో రెండు, కోనేరుపేటలో ఒకటి, ఉంగుటూరు, రావులపర్రులలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం రూరల్ పిప్పర, తాడేపల్లిగూడెంలో ఒక్కొక్క కొవిడ్ పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. ఏదిఏమైనా ఎండాకాలం కాబట్టి వైరస్ దూకుడు తక్కువగా ఉంటుంది. అయితే జనం మాస్క్ లు ధరించడం , గుంపులలోకి వెళ్లకుండా ఉంటె మంచిది.
