సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి విజయవాడ నుండి విశాఖ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీని ప్రభావం భీమవరం టౌన్ స్టేషన్ నుండి వెళ్లే పలు రైళ్లపై కూడా పడింది. నిడదవోలు రైల్వే జంక్షన్ సమీపంలో ఎల్సి 383వద్ద పవర్ బ్రేక్ అయింది. రైల్వే ట్రాక్‌పై నుంచి వెళుతున్న 11 కెవి విద్యుత్ లైన్ తెగి రైల్వే ఓహెచ్ఈ (OHE)పై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సమీపంలో నిలిచిన గూడ్స్ రైలు, రాజమండ్రి వైపు వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ రైల్వే అధికారులు నిలిపివేస్తున్నారు.సమాచారం అందుకున్న టీఆర్డీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టారు. పునరుద్ధరణకు మరో మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. అయితే విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే రైళ్లు ఇంకా అలాగే నిలిచిపోయాయి. మొత్తానికి మూడు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి.
