సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి మాజీ ఎంపీ. సీనియర్ న్యా యవాది, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్ట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. తాను మార్గదర్శిపై చేస్తున్న 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు చోటుచేసుకుందని అన్నారు. నేడు,మంగళవారం సుప్రీంలో జరిగిన వాదనల నేపాఢ్యములో నా వాదనలు తో ఏకీభవిస్తూ, సుప్రీం కోర్ట్ మార్గదర్శి యాజమాన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసిందని డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారు? చెక్కుల రూపంలో ఇచ్చారా? మరో రూపంలో ఇచ్చారా?. డిపాజిటర్ల అన్నివివరాలను కోర్టుకు అందజేయాలి. ఒకచోట హెచ్యూఎఫ్, మరో చోట ప్రొప్రైటరీ అని 2రకాలుగా ఎందుకు రాశారు? ఈ విషయాలన్నింటికీ సమాధానం చెప్పాలి’ అని ఆదేశించిందన్నారు. ఇక మార్గదర్శి ఫై దర్యాప్తు వేగం అందుకొంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శి డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని ఆదేశించింది. మార్గదర్శిలో ఇన్వె స్ట్మెంట్ ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ప్రశ్నించింది.
