సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యూపీలో మాఫియా డాన్ ల ఏరివేతలో భాగంగా ఇటీవల వరుసగా జరుగుతున్నా ఎన్కౌంటర్స్ , క్రిమినల్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్యోదంతం పై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తొలిసారి స్పందించారు. నేడు, మంగళవారం ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న యోగి మాట్లాడుతూ.. ఇకపై యూపీలో గ్యాంగ్స్టర్లు ఏ ఒక్కరిని బెదిరించలేరని పేర్కొ న్నారు. సాధారణ ప్రజానీకం నుంచి వ్యాపారవేత్తల వరకు ఎవరికీ క్రిమినల్, మాఫియా భయం ఉండబోదని తేల్చిచెప్పా రు. ప్రస్తుతం రాష్ట్రం లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని ప్రకటించారు. 2017కు ముం దు ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు అధ్వాన్నం గా ఉన్నాయని యోగి ఆదిత్యా నాథ్ విమర్శించారు. గతం లో రాష్ట్ర గుర్తింపు కోసం పాకులాడే పరిస్థితి ఉం డేదని మం డిపడ్డారు. అయితే 2017 నుం చి 2023 వరకు రాష్ట్రంలో ఒక్క మతపరమైన హిం స కూడా చోటుచేసుకోలేదని తెలిపారు. ఈ ఆరేళ్ల కాలం లో తమ ప్రభుత్వం ఒక్క సారి కూడా కర్ఫ్యూ విధిం చలేదని అన్నా రు. తమ రాష్ట్రాన్ని దేశం లోనే అగ్రగామిగా తీర్చి దిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *