సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా విపరీతంగా వైరల్ కావడంతో నేడు, సోమవారం ఏపీ ప్రతిపక్ష నేత, చంద్రబాబు.. రజనీకాంత్ ఫై విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ ట్విట్ చేసారు.. సౌమ్యుడు అయిన రజనీ కాంత్ ఫై తీవ్ర అహంకారంతో అధికారపార్టీ నేతలు చేస్తున్న అర్థంలేని విమర్శలను తెలుగు ప్రజలెవరూ సహించరన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ లో .. .‘‘అన్న గారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని .. అనుభవాలను పంచుకున్న రజనీకాంత్ ఫై వైసిపి మూకల అసభ్య కర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసిపి నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసిపి ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ కూడా చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదు. శిఖరం లాంటి వ్య క్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ ఫై వైసిపి నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటి దురుసు గల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *