సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలతో పాటు..భీమవరం పట్టణంలో నేటి సోమవారం నుండి భారీ వర్షం తో పాటు చీకటి అంధకారం అలముకొంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు అన్ని జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు మరి ఇబ్బంది పడ్డారు. భీమవరం పీపీ రోడ్డు పోలీస్ బొమ్మ ప్రధాన సెంటర్ కూడా జలమయం అయ్యింది. ఇక రైల్వే నిర్మించిన పలు టర్నల్స్ వర్షపు నీటిలో నిండిపోయి వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మొత్తానికి ఉదయం 10 గంటలకు వర్షం పూర్తీ తెరిపించింది. ఉదయం 11 గంటలకల్లా భానుడు తిరిగి తన తీవ్రతను చూపెడుతుండటంతో.. శ్రామికుల మే డే వేడుకలు , ఎర్ర జెండా ర్యాలీలు, శ్రామికుల నినాదాలు ప్రారంభమయ్యాయి. రైతులు, వ్యాపారులు , శుభకార్యక్రమాలు చేసుకొనేవారు ఊపిరి తీసుకొన్నారు. ఈ అకాల వర్షాల లో ఈ సీజన్ లో చుట్టుప్రక్కల పండించే మొగల్తూరు తదితర ప్రాంతాలలో ప్రసిద్ధ మామిడి పంట తీవ్రంగా నష్టపోతోంది. ఏది ఏమైనా మరో 2 రోజులు పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజెయ్యడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *