సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో జగన్ సర్కార్ కు మరో శుభవార్త అందింది. నేడు, శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు పచ్చ జెండా ఊపేసింది. . జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. అమరావతి లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని, రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా? రాజధాని ఏ ఒక్కరికో..ఒక వర్గానికో పరిమితం కాదని.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పు పై జగన్ సర్కార్ హర్షం ప్రకటించింది. ఈనెల 15వ తేదీ లోగ సుమారు 45వేల మంది కుటుంబాలకు సెంటు భూమి చప్పున పట్టా పంపిణీకి ప్రభుత్వ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *