సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నేడు, శనివారం 10 తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ను విద్య శాఖ మంత్రి బొత్య సత్యనారాయణ విడుదల చేసారు. ఈసారి పదో తరగతి పరీక్షల్లో మొతం 72.26 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో అగ్రస్థానంలో బాలికల ఉత్తీర్ణత 75.38 శాతం బాలురు ఉత్తీర్ణత 69.27 శాతం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత లభించింది. 38 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. 84.7శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా చివరి స్థానం పొందింది. జూన్ 2 నుంచి 10 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన చివరు తేదీ మే17గా నిర్ణయించారు. అలాగే రీ కౌంటింగ్, రీ వేరిఫికేషన్ దరఖాస్తుకు మే 13 చివరి తేదీ. గత ఏడాది తో పోల్చితే ఈ సారి ఉత్తీర్ణత 5 శాతం పెరిగింది. మొత్తం 6,05,052 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *