సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం సమీపంలో కేవలం 11 కిలో మీటర్లు దూరంలో 450 ఏళ్ళ క్రితం శ్రీ వేంకటేశ్వరుడు స్వయం భువుడుగా వెలసిన కాళ్ళకూరు గ్రామం లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి సుమారు 30 అడుగుల రథోత్సవం వైభవంగా సాగింది. వేద మంత్రాల నడుమ పలు మేళతాళలతో సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత రథంపై ఆసీనులైన స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, డీసీసీబీ ఛైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి వాసు రథాన్ని లాగి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బుట్ట బొమ్మలు, శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, మేళతాళాలు, డీజే సిస్టం భక్తులను ఉత్సహపరిచాయి. . రథోత్సవంలో పాల్గొన్న భక్తులు రథాన్ని లాగేందుకు గోవిందా.. గోవిందా.. అంటూ పోటీపడటంతో వీధులన్నీ ఉమ్మడి పశ్చిమ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కాళ్ళకూరులో దారులన్నీ కిక్కిరిసిపోయాయి.కాళ్ల పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైౖర్మన్ దండు వెంకటకృష్ణంరాజు, కార్యనిర్వహణాధికారి మోకా .అరుణ్‌కుమార్, ధర్మకర్తలు, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా చిన్న తిరుమలగా పిలువబడే జిల్లాలోని ద్వారకా తిరుమల లో గత శుక్రవారం రాత్రి జరగవలసిన రధోత్సవం వర్షం కారణంగా రద్దు చెయ్యడం గమనార్హం.
