సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ నేడు, శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మరోసారి మార్గదర్శి చిట్ పండ్స్ ఫై , రామౌజీరావు ఫై తీవ్ర స్థాయి ఆరోపణలు తనదయిన శైలిలో చేసారు. మార్గదర్శి చిట్ పండ్ చట్టవిరుధంగా పని చేస్తుందని తనతో విభేదించే టీడీపీ నేతలతో సహా ఎవరైనాచర్చకు రావచ్చని తాను విసిరినా సవాల్ ను స్వీకరించి చర్చకు సిద్దమైన టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డి మరలా ఎందుకో వెనక్కి తగ్గారని .. జీవీరెడ్డి తరువాత వస్తానన్నా రు.. వస్తే చర్చ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏది ఏమైనా తప్పు ఒప్పుకొనేవరకు మార్గదర్శి ఫైనాన్షియర్లపైనే తన పోరాటం ’’ అని ఉండవల్లి అన్నారు. ‘చిట్స్ నిర్వాహకులు ఇతర వ్యా పారాలు చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది. రామోజీ తప్పు చేశారని నిర్ధారణ చేసుకున్నాకే అధికారులు చర్యలు చేపట్టారు. బ్లాక్ మని వైట్ మని లెక్కలు చెప్పలేని వారు మార్గదర్శిలో ఫిక్సడ్ డిపాజిట్ చేస్తున్నారు. డీఎస్, జీఎస్టీలు కట్టడం లేదు. రూ.15 వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్య క్తి రామౌజీరావు వ్యవస్థను శాసిస్తున్నారు. నిజానికి ఆయన పెట్టుబడి 2 కోట్లు మాత్రమే.. మిగతా సొమ్ము అంతా ప్రజలదే..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రామోజీరావుకి వచ్చే ఆదాయం రోజుకు పది కోట్లు. ప్రజల డబ్బుతో వ్యాపారం చేసే సంస్థలో నిర్వాహకునికి సంబంధించి 50 శాతం సొంత పెట్టుబడి ఉండాలి అని జడ్జిమెంట్ ఉంది. చట్టాన్ని అందరికీ వర్తింపచేయాలి. రామోజీరావు దీనికి మినహాయింపు కాదు’’ అని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నా రు.
