సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు బకాయిల కేసులో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు ఫై సీబీఐ న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు అయ్యింది. గతంలో ఆయన తమిళనాడులోని ట్యూటీకొరిన్‌లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు తిరిగి చెల్లించలేదని 2019 ఏప్రిల్‌ 29న సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజా వార్త సమాచారం మేరకు రూ.947.71 కోట్ల మేరకు బకాయిలు చెల్లించని కారణంగా ఇండ్‌ భారత్‌ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్‌ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ న్యాయస్థానంలో గత శుక్రవారం చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిపై తాజగా ఎంపీ రఘురామా స్వాందిస్తూ .. ఈ సమయంలో తనపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చెయ్యడం శుభపరిణామం అని, తాను చెల్లించవలసిన బకాయిలలోనిజానికి 300 కోట్ల రూపాయలు వడ్డిలే ఉన్నాయని, తనకు వివిధ సంస్థల నుండి రావాల్సిన బకాయిలు ఉన్నాయని ఇదేమి క్రిమినల్ కేసు కాదని సివిల్ మాత్రమేనని మీడియాతో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *