సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తం ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కి మంచి ఊతం ఇచ్చి క్యాడర్ లో జోష్ నింపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లో ఘన విజయం తో తదుపరి… సీఎం పదవి కోసం 5 రోజుల హైడ్రామా తరువాత .. నేడు, శనివారం కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్ థావర్‌ చంద్ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్‌, ప్రియాంక సమక్షంలో.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం విశేషం. కర్ణాటక మంత్రులుగా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, ఛత్తీస్‌గర్ సీఎం భూపేశ్ భగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా, తమిళ నటుడు కమల్‌హాసన్ హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *