సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వృద్దుల కు పెన్షన్ కానుక ఇకపై నెలకు 2500 రూపాయల చప్పున పెంపును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పెంచిన పింఛన్లను అవ్వాతాతలకు సీఎం జగన్ పంపిణీ చేశారు.నూతన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానని సీఎం అన్నారు. గత ప్రభుత్వం 36 లక్షల మందికే పెన్షన్ ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెంచామని, కుల,మత, రాజకీయాలకతీతంగా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. ఈ నెలలో కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు.
