సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత రైల్వే వారాంతాల్లో సాయి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల్లో శిర్డీ , నాసిక్ లను సందర్శించేందుకు ఐఆర్సీటీసీ (IRCTC tour package). సాయి శివమ్ పేరిట ఈ ప్యాకేజీనిఅందిస్తోంది. మూడు రాత్రులు, 4 పగళ్లు సాగే ఈ యాత్ర వివరాలు చుస్తే.. .సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై శిర్డీ, నాసిక్, త్రయం బకేశ్వరం సందర్శన అనంతరం మళ్లీ సికింద్రాబాద్ చేరుకోవడం తో ఈ యాత్ర పూర్తవుతుంది. తదుపరి ట్రిప్ జూన్ 2న ప్రారంభం కానుంది. జూన్ నెలాఖరు వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం సికిం ద్రాబాద్లో రైలు ప్రారంభమవుతుంది. నిజామాబాద్, కామారెడ్డి స్టేషన్లలోనూ ఈ రైలు ఆగుతుంది. కంఫర్ట్, స్టాండర్డ్ పేరిట 2 రకాల ప్యాకేజీలుఉంటాయి. కంఫర్ట్ ఎంచుకున్న వారికి థర్డ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్ ఎంచుకున్న వారికి స్లీపర్ క్లాస్ లో బెర్త్కేటాయిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్ ప్రెస్) ప్రారంభం అవుతుంది.రెండో రోజు (శనివారం) ఉదయం 7.10 గంటలకు నగర్ సోయిల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి శిర్డీలోని హోటల్కు చేరుకోవాల్సి ఉంటుంది. హోటల్ నుంచి నడక మార్గం లో ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.రాత్రంతా శిర్డీలోనే బస ఉంటుంది. మూడో రోజు శిర్డీ నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ ప్రయాణం ఉంటుంది. స్థానికంగా ఉన్న దర్శనీయ స్థలాలను ఆటో రిక్షాల్లో చేరుకోవాలి. సాయంత్రానికి మళ్లీ నాగర్సోల్ స్టేషన్కు ప్రయాణం ఉంటుంది. ఆదివారం రాత్రి 9.20 గంటలకు 17063 రైలును చేరుకొంటారు. సోమవారం ఉదయం 8.50 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *