సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లో నేడు, ఆదివారం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు లో లక్ష్మీపార్వతి, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, రాంగోపాల్ వర్మ, కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు ఎన్టీఆర్ ఘనత, ఆయనకు చంద్రబాబు చేసిన ద్రోహం ఫై మాట్లాడారు. .ఈ వేడుకల్లో ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘మీకు ఒక సీరియస్ జోక్ చెప్పడానికి వచ్చా ను. ఎవరూ నవ్వ లేని ఆ జోక్.. నందమూరి తారక రామారావును చంపినవాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదు. ప్రస్తుతం రాజమండ్రిలో మహానాడు జరుగుతోంది. అది ఎంత పెద్ద జోక్ అంటే స్వర్గం లో ఉన్న ఎన్టీ రామారావుగారు నవ్వాలో,ఏడ్వాలో తెలియని జోక్. ఇక్కడ ఇంటి అల్లుడు అయిన వ్య క్తి(చంద్రబాబు) ఎన్టీఆర్ ను దారుణంగా టార్చర్ చేసి ఏడిపించి ఏడిపించి చంపారు. మళ్లీ ఇప్పుడు ఆయనే దండలు వేయడం జోక్. ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీపార్వతి ఆయనకు సేవలు చేశారు. అయినా సరే చాలామంది ఎన్టీఆర్.. లక్ష్మీపార్వ తి మాయలోపడ్డారంటున్నారు.. అంటే ఆయనకు అవగాహన లేదా? అలాంటప్పు డు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు? రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్క న కూర్చు ని వాళ్లను పొగడటం అంటే ఆయన కూడా ఎన్టీఆర్ కు వెన్ను పోటు
పొడిచినట్లే! నం దమూరి తారకరామారావుగారి ఫ్యా మిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఒక్కడే తాతమీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదు. అందుకు తారక్ కు నేను థ్యాంక్స్ చెప్తున్నా ‘ అన్నారు రాంగోపాల్ వర్మ
