సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాజమండ్రి లో 2 రోజులు పాటు జరిగిన తెలుగు దేశం పార్టీ మహానాడు పండుగకు మొదటి రోజు క్యాడర్ పెద్ద సంఖ్య లో హాజరు కానప్పటికీ నిన్న ఆదివారం కావడంతో 2వ రోజు భారీ స్థాయిలో క్యాడర్ హాజరు అయ్యింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి 1లక్ష కు పైగా హాజరు కావడంతో టీడీపీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ( వారి నేతలు అంచనా ప్రకారం 2 లక్షలు అంటున్నారు) దీనితో తెలుగుదేశంలో మంచి జోష్ నెలకొంది. గత వారంలో భీమవరం శివారులో నిర్వహించిన ‘ మినీ మహానాడు’ తో రాజమండ్రి మహానాడుకు క్యాడర్ సమీకరణకు ప్యూహాత్మకంగా నేతలు అడుగులు వేశారు. ముఖ్యంగా భీమవరం, పాలకొల్లు, ఉండి ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం శ్రేణులు వేల సంఖ్యలోతరలి వెళ్లారు. నియోజకవర్గ కన్వీనర్లు ఈసారి పకడ్బందీగా వ్యవహరించారు. మరోవైపు నారా లోకేశ్‌తోను పార్టీ నియోజకవర్గ కన్వీనర్లంతా సమీక్ష జరిపారు. జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు సీతారామలక్ష్మి, పార్టీ శాసన సభ ఉపనేత నిమ్మల రామానాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు,మెంటే పార్ధ సారధి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, పార్టీ కన్వీనర్లు బొరగం శ్రీనివాస్‌, చింతమనేని ప్రభాకర్‌, బడేటి చంటి, వలవల బాబ్జీ, ఆరిమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు, ముళ్ళపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, కోళ్ళ నాగేశ్వరరావు తదితరులు మహానాడుకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *