సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ను బలోపేతం చెయ్యడానికి క్షేత్ర స్థాయి నుండి పార్టీని సమర్థులతో బలోపేతం చెయ్యవలసి ఉందని, అందుకే ఈ సంక్రాంతి పండుగ నాటికి పార్టీ కమిటీలన్నీ ఏర్పాటు చేస్తామని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. తాజగా అయన ఆకివీడు మండలం కుప్పనపూడిలో జెండా స్తంభం ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రజలను తీవ్ర ఇబ్బందుల కు గురిచేస్తుందని, వైసిపి నియంతపాలనపై ఉగాది నుంచి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు కనకరాజు సూరి, పార్టీ మండల అధ్యక్షుడు కొటికలపూడి తాతాజీ, జిల్లా కార్యదర్శి గవరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *