సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి అభిమానులు కడుతున్న ఒక కార్టూన్ ప్లెక్సీ పెను సంచలనం సృష్టిస్తుంది. ఆ ప్లెక్సీలను పలు ప్రాంతాలలో టీడీపీ జనసేన పార్టీలు తొలగించేదానికి చేసే ప్రయత్నాలు కూడా అధికార వైసీపీ నేతలతో ఘర్షణ వైఖరికి కారణం అవుతున్నాయి. దీనిపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో ప్రకాశం చౌక్ సెంటర్ లోను, ఆదివారం బజారుసెంటర్ తో పాటు.. నియోజకవర్గం లోని పలు కూడళ్లలోపాటు .. తణుకు పట్టణం లోని ప్రధాన కూడళ్లలో …పేదలకు, పెత్తం దార్లకు మధ్య జరిగే యుద్ధం .. అంటూ ఈ ఫ్లెక్సీ లను ఏర్పా టు చేసిన ఫ్లెక్సీలు ను వాహనదారులు స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంతకీ ఆ ఫ్లెక్సీ లలో ఏముందంటే..చంద్రబాబు, నారా లోకేశ్ రధం లాంటి పల్లకీలో కూర్చుని ఉంటే.. కొన్ని మీడియా యాజమాన్యాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు దానిని మోస్తున్నట్టు ఉంది. వారి పక్కనే నిలబడి ఉన్న పెత్తందారులు మరోవైపు ఉన్న పేదల పైకి రాళ్లు విసురుతున్నట్టుగా ఉంది.. అయితే పేదలకు అండగా భారీ ఆకారం లో హీరో మహేష్ బాబు తరహాలో సీఎం జగన్ పేదలకు అండగా నిలబడి పెత్తం దార్లు విసురుతున్న రాళ్లు పేదలకు తగలకుండా నిలబడి ఉన్నారు. ఈ యుద్ధం లో పేదవారికిఅండగా జగనన్న ప్రభుత్వం ఉంది. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ యుద్ధం లో మీ మద్దతు ఎవరివైపు..? అంటూ క్యాప్షన్ ఉంది. ఏమిటి ఈ ఫ్లెక్సీ విచిత్రంగా ఉంది అని బస్సులలో వెళ్లేవారు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
