సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, సోమవారం ఉదయం వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమా చేసింది. మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ కాగా గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లయ్యింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే.2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.3,848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయ గా, పీఎం కిసాన్‌ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం కేటాయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *