సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రొయ్యల ఎగుమతులకు రాజధానిగా పేరొందిన బీమవరం మార్కెట్ లో ఇటీవల మరోసారి రొయ్యల ధరలు తగ్గుతుండటంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి ధరలను నిర్దేశించిన సరే .. ఇటీవల వాతావరణ మార్పులతో అసలుకు నష్టం రాకూడని పలు చెరువులలో తక్కువ కౌంట్ కే రొయ్యలు పెట్టుబడి ఎక్కువ జరుగుతుండటంతో సరకు ఎక్కువ కావడంతో ( కృష్ణ , ఏలూరు జిల్లా సరకు కూడా ఇక్కడికే రావడం తో )డిమాండ్ తగ్గి రొయ్యల కొనుగోలు చేసే సిండికేట్ వ్యాపారులు చెప్పిన రేటుకె.. తక్కువ ధరకే రొయ్యలు అమ్మేయవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు.. వంద కౌంట్‌ ధర బాగా తగ్గిపోయింది. వారం రోజుల క్రితం వంద కౌంట్‌ రొయ్య ధర కేజీ రూ.240 పలుకగా, ఇప్పుడు రూ.215కు పడిపోయింది. 90 కౌంట్‌ ధర రూ.225, అన్ని కౌంట్ల ధరలు కేజీకి సుమారు రూ.20 నుంచి 25కు పడి పోయాయి. పరిస్థితులు చక్కబడతాయని మరి కొద్దీ రోజులలలో యధాస్థితి కి రేటు పెరుగుతుందని మరికొందరు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *