సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ.వైయస్ అవినాష్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో పాటు ఈ కేసు విచారణలో ఉండగా ఒక వర్గం మీడియా చేసిన వివాదాస్వాద కంటెంట్ డిబేట్స్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యా ఖ్యలు చేసింది. కడప ఎం పీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం లక్ష్మణ్ తనపై వివాదస్వాద వ్యాఖ్యలు చేస్తూ తనపై తీర్పు ఫై ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఆ మీడియా చేనెల్స్ ఫై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దానితో .. మే 26న రెండు మీడియా ఛానల్స్ లో కోర్టులపై చర్చలు జరిపిన వీడియో క్లిప్‌లను ఇవ్వా లని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆయన ఆదేశించారు. గత వారం తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ఊరట’ కలిపిస్తూ తీర్పు ఇవ్వడంతో రెచ్చి పోయిన ఆ చేనెల్స్ .. మీడియా డిబేట్స్ లో హైకోర్టు న్యాయమూర్తులపై డబ్బు సంచులతో అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ మీడియాలలో వచ్చిన వీడియోలను కోర్టుకు అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
