సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలుగా చెలామణి అవుతున్నారని ఆరోపిస్తూ.. తాను చేతకానివాడిని కాదని, ఇక చూస్తూ ఊరుకోనని సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు.’ అంటూ పలు సంచలన వ్యాఖ్యలు తో సీనియర్ నటుడు మోహన్ బాబు బహిరంగా లేఖ రాశారు. ఆయన రాసిన లేఖలో తెలంగాణాలో సినిమా టికెట్ ధరలు భారీగా పెరగడం చిన్న సినిమాకు దెబ్బ అయితే ఏపీలో టికెట్ రేట్లు బాగా తగ్గించడం పెద్ద సినిమాకు ఇబ్బంది అని, ఐతే మనం అందరం కల్సి మన సమస్యలపై ముందు సమీక్షించి మేలయిన నిర్ణయాలు చెయ్యాలని అంతే కానీ పెద్ద సినిమాలు తీసేవారే, పెద్ద హీరోలే నిర్ణయాలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ‘అందరం కలిసి సినిమాను బతికిద్దాం. రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి మనకు న్యాయం చేయాలని అడుగుదాం. మా అందరికీ నిర్మాతలు దేవుళ్లు. కానీ ఈరోజు నిర్మాతలు ఏమయ్యారు. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు.’ అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
