సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల మీడియాలో సంక్రాంత్రి పర్వదినాలకు కి ఎంపీ భీమవరం లో తన కార్యాలయానికి వస్తారని, వైసీపీకి, తన ఎంపీ పదవికి రాజీనామా ప్రకటన చేసి బీజేపీలో చేరతారని, ఉపఎన్నికలో పోటీచేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఢిల్లీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన రాజీనామా వార్తలపై వివరణ ఇచ్చారు. రాజీనామా చేస్తున్నట్లు తాను ఎక్కడ అనలేదు.. కానీ ప్రచారం విన్నానని తెలిపారు. తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, అందరి సూచనలతోనే ముందుకెళ్తానని తెలిపారు. తమ పార్టీవారు ఒకపక్క ప్రేమిస్తూనే.. మరో పక్క ద్వేషిస్తున్నారని దుయ్యబట్టారు. ‘సీఎం జగన్‌కు ఛాలెంజ్ చేస్తున్నా. జగన్‌కు నెల రోజుల సమయం ఇస్తున్నా. నాపై చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నన్ను ఎవరూ డిస్‌క్వాలిఫై చేయలేరు. ఎందుకంటే నేను నా పార్టీని ప్రేమిస్తున్నా. నిన్న, ప్రధానిమోడీ తో భేటీ తర్వాత జగన్ ముఖంలో నిస్సహాయత కనపడింది. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చల్లో ఏం జరిగిందో వారికే తెలియాలి.అని రఘురామకృష్ణరాజు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *