సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో నేడు, మంగళవారం మాజీ మునిసిపల్ చైర్మెన్ గ్రంధి వెంకటేశ్వర రావు మృతి చెందిన నేపథ్యంలో పట్టణ వ్యాప్తంగా పలు వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివెయ్యడం జరిగింది. అయితే ఆయన మృతికి సంతాపంగా రేపు బుధవారం భీమవరం పట్టణంలో కూరగాయలు , పండ్లు అమ్మకాలు జరగవని, దుకాణాలు మూసివేయడం జరుగుతుందని నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ప్రకటించింది. తమ కూరగాయల వ్యాపారుల అభివృద్ధి కోసం, ఇంకా బుధవారం మార్కెట్ లో డైలీ మార్కెట్ నిర్మాణం కోసం గ్రంధి వెంకటేశ్వర రావు చేసిన సేవలను, కృషిని గుర్తు చేసుకొంటూ అయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నామన్నారు.
