సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలోని చిన అమిరం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. 21 లక్ష 30 వేల రూపాయలతో కొత్తపేటలో నిర్మాణం చేసిన అంతర్గత సిసి రోడ్లను, ప్రారంభించారు. తదుపరి 20 లక్షల రూపాయలతో చినఅమిరం బీసీ ఏరియాలో నిర్మాణం చేసిన అంతర్గత సిసి రోడ్లను ప్రారంభించారు. భీమవరం,అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నాం, ప్రతి గ్రామాన్ని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజలతో పాటు వైసిపి నేతలు విశేషంగా పాల్గొన్నారు.
