సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి , మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం నేడు, శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మరో లేఖాస్త్రం ప్రయోగించి దానిలో.. పవన్ గారు మీరు నాపై దుగ్ధ ఉంటె.. స్వయంగా నన్ను విమర్శించాలి కానీ, మొలతాడు, గోచి గుడ్డ లేనివాళ్ళతో తనను తిట్టిస్తున్నారని ఇది తగదని, కాపుల రిజెర్వేషన్స్ కోసం పోరాడిన నన్ను నా కుటుంబాన్ని చంద్రబాబు అవమానించి వేధించారని, పోలిసుల ద్వారా అరెస్ట్ చేసి లాక్కెళుతూ నా భార్య, కోడలిని లం.. అంటూ తిట్టించ్చారని, ఎందరో అమాయక కాపు యువకులను ఎన్నో కేసులు పెట్టి అరెస్ట్ చేసిన కూడా మీరెప్పుడు స్వాదించడం కానీ, ఎవరిని పరామర్శించడం కానీ చెయ్యలేదని అన్నారు. ఇప్పుడు మీ రాజకీయ లబ్ది కోసం కాపునాడు లక్ష్యాల కోసం పోరాడిన నన్ను తిట్టిస్తున్నారని విమర్శించారు. ‘రాజకీయాలు కు దూరంగా ఉన్న నన్ను రెచ్చగొట్టి మరల ఎన్నికలలో పోటీకి సిద్ధం చేసిన మీకు ధన్యవాదములు.. కాకినాడ లో కానీ లేదా పిఠాపురం నుండి కానీ పోటీ చెయ్యండి. పిఠాపురంలో నేను నిలబడతాను. నాపై గెలచి మీ సమర్ధత ను నిరూపించుకోండి’ అని సవాల్ విసిరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. చం ద్రబాబు స్కెచ్ ప్రకారం పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1981 నుంచి ముద్రగడ కాపుల కోసం పోరాడుతున్నారని, ఆ కాపుల కోసం ముద్రగడ ఆస్తిని, పదవులను కోల్పోయారన్నారు.. కాపుల కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ముద్రగడ. వంగవీటి మోహనరంగాను చంద్రబాబు చంపించారు..’ముద్రగడకు పవన్ క్షమాపణ చెప్తే తప్పేంకాదు. అని పోసాని అన్నారు.
