సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేటి బుధవారం ఉదయం 8. గంటలకు భీమవరం మాజీ మునిసిపల్ చైర్మెన్ గ్రంధి వెంకటేశ్వర రావు అంతిమ యాత్ర ఆయన నివాస గృహం నుండి పూలతో అలంకరించిన శకటంపై బయలు దేరింది. బస్ స్టాండ్ వద్ద చౌరస్తా గ్రంధి అభిమానులుతో నిండిపోయింది. ఆయనకు కడసారి వీడ్కోలు పలకడానికి ప్రజలు తరలివచ్చారు. వారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో పాటు ఆయన సోదరులు, వారి కుటుంబాలకు సంతాపం తెలిపి సంఘీభావంగా వేలాదిగా ప్రజలు మస్క్ లు ధరించి జివిఆర్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మంత్రి పేర్ని నాని కూడా నేటి ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరయ్యారు. గత రాత్రి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నా తండ్రి వై ఎస్ తో పాటు నాకు మద్దతుగా వైసిపి తరపున నిలచిన సీనియర్ నేత గ్రంధి వెంకటేశ్వరరావు గారి మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. గ్రంధి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..
