సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లో కెసిఆర్ కుటుంబ అవినీతి పాలనలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా నేడు, సోమవారం తొలిసారి అధికారికంగా ప్రకటించారు. సమైక్య ఆంధ్ర నినాదంతో తెలంగాణలో 2014 ఎన్నికలలో వైసిపి పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మంలో లక్ష కు పైగా ఓట్ల కు పైగా సంచలన విజయంతో ఏపీ ప్రజలకు సుపరిచితుడైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదుపరి బి ఆర్ ఎస్ లో చేరిన తగిన గుర్తింపు లేక తిరుగుబాటు ప్రకటించిన విషయం అందరికి విదితమే.. నేడు, ఢిల్లీలో రాహుల్‌గాంధీ. మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం అయ్యి లో తన రాజకీయ భవిషత్తు కు కాంగ్రెస్ లో కీలక స్తానం ఫై హామీ పొందా ..అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని.. పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించానని.. అయితే ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. గారడి మాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తులు అని విమర్శించారు. జూలై 2 ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *