సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం ఛీఫ్ సెక్రటరీ అదేశములు మేరకు చిరకాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు మునిసిపల్ శాఖల ఉన్నతాధికారులు స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి IAS అధికారిణి , కమీషనర్ మరియు డైరెక్టర్ P. కోటేశ్వరరావు IAS మరియు తదితరులతో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మునిసిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం తరుపున అధ్యక్షులు, ఎస్ కృష్ణ మోహన్ రావు ఇతర సభ్యులు కలసి మునిసిపల్ వ్యవస్తాగత సమస్య అయిన ఉమ్మడి సర్వీస్ రూల్స్, సిబ్బందికి PF ఖాతాలు, సబార్డినెట్ సర్వీస్ కెడర్లు కుదింపు మరియు గెజిడెడ్ హోదా మరియు సచివాలయ ఉద్యోగులలో ఆయా శాఖల ద్వారా సర్వీస్ రూల్స్ మరియు పదోన్నతుల కల్పన, సచివాలయాలలో మౌలిక వసతులు కల్పన తదితర సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు k. శివాజీ, కోశాధికారి సమ్మెట వెంకటేష్ లు పాల్గొన్నారు.
